Shyam Singha Roy Movie Satellite Rights : న్యాచులర్ స్టార్ ‘నాని’ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్నా మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ . ఈ మూవీలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుండడం.. ముగ్గురు హీరోయిన్లు ఉండడంతో మూవీ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 14న ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ రంగలీల మైదానంలో సాయంత్రం 5 గంటలకు గ్రాండ్ గా జరుపబోతున్నారు.
ఇప్పటికే ‘శ్యామ్ సింగరాయ్’ ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 10 కోట్లకు B4U ఛానెల్ దక్కించుకోగా.. తాజాగా తెలుగు శాటిలైట్ హక్కుల కోసం జెమినీ టీవీ రూ. 10 కోట్లు చెల్లించిందట. ఇది నాని కెరీర్లోనే అతిపెద్ద శాటిలైట్ రైట్స్ ఒప్పందం అని చెప్పొచ్చు. మొత్తంగా నాని నటించిన మూవీస్ కు మంచి డిమాండ్ ఉంది. ఈ కోవలో మూవీకి ఈ రేంజ్ రేటు పలికిందని చెబుతున్నారు.
డిసెంబర్ 24న మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక్కడ థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకు హిందీ డబ్బింగ్ టీవీలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.