Bright Telangana
Image default

Unstoppable With NBK : మనలో ఒకడు..సెల్ఫ్‌మేడ్‌కి సర్‌నేమ్ నాని

Unstoppable With NBK Episode 2

బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. దీపావళి రోజు నుంచి ఈ షో స్ట్రీమింగ్ అవుతూ.. విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక మొదటి ఎపిసోడ్‏లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సందడి చేశారు బాలకృష్ణ. మోహన్ బాబుతోపాటు.. మంచు లక్ష్మి, మంచు విష్ణు సైతం ఈషోలో పాల్గోన్నారు. ఇక వీరిని తనదైన స్టైల్లో ప్రశ్నిస్తూ అలరించారు బాలకృష్ణ. ఇక మొదటి రోజు ఈ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది.

బాలకృష్ణ చేస్తోన్న టాక్ షో ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ రెండో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. సెకండ్ ఎపిసోడ్‌కి నేచురల్ స్టార్ నాని వస్తున్నాడు.

బాలకృష్ణ ఎప్పటిలానే తన స్టైల్లో ఎనర్జీతో, మేనరిజమ్స్‌తో అదరగొట్టేశారు. ఇక నాని అయితే.. సామాన్యుడిగా సోలోగా వచ్చానంటూ ఇచ్చిన ఇంట్రడక్షన్ సింప్లీ సూపర్బ్. బాలకృష్ణ డైలాగులు చెప్తూ క్రికెట్ ఆడి, బాలకృష్ణ కూడా ఆడించాడు నాని. ప్రోమో అంతా సరదాగా సాగిపోయింది. బాలకృష్ణతో మంచి అనుబంధం ఉంది నానికి. ఇక వీళ్లిద్దరూ కలిసి చేసే సందడి ఎలా ఉంటుందోనని ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts

Shyam Singha Roy Review : ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Lakshya OTT Trailer : ‘లక్ష్య’ మూవీ ఓటిటి ట్రైలర్‌ రిలీజ్..

Hardworkneverfail

Akhanda Trailer: ‘అఖండ’ ట్రైలర్.. అఘోరగా బాలయ్య నట విశ్వరూపం..

Hardworkneverfail

Unstoppable with NBK : అన్‏స్టాపబుల్ షోలో రవితేజ, గోపిచంద్ మలినేని సందడి..

Hardworkneverfail

‘ఆహా’లో సిద్దార్థ్ ఒరేయ్‌ బామ్మర్ది మూవీ ..

Hardworkneverfail

Akhanda Collections : బాలయ్య కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్.. ‘అఖండ’ మూవీ 10 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail