న్యాచులర్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ టీజర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఈ మూవీలో నాని చేస్తున్న వాసు క్యారెక్టర్ మోషన్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుండడం.. ముగ్గురు హీరోయిన్లు ఉండడంతో మూవీ మీద అంచనాలు ఏర్పడ్డాయి. మూవీ టీజర్‌ని నవంబర్ 18వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో నాని తన చేతిలో మండుతున్న కర్రను పట్టుకుని ఉన్నారు. నిప్పు కణికలతో పోస్టర్ పవర్ ఫుల్‌గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే టీజర్ ఎంతో హై ఇంటెన్స్‌తో ఉండబోతోందనేది అర్థమవుతుంది. కాగా, ఈ మూవీకి సత్యదేవ్ జంగా కథను అందించగా.. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 24న ఈ మూవీ విడుదలకానుంది.
MAA Elections: నరేశ్ వల్లే ‘మా’లో ఇన్ని గొడవలు – శివాజీ రాజా