Bright Telangana
Image default

Acharya: చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ‘ఆచార్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

acharya telugu movie release date

తెలుగు సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్టు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవి కానుకగా థియేటర్‌లలో అలరించాల్సిన ఈ సినిమా… కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యమవడంతో విడుదల వాయిదా పడింది. తొలుత దసరా కానుకగా తీసుకువస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తి సానుకూలంగా లేకపోవడం, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది.

ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూనే చిత్రంలో ఎంతో కీలకమైన సిద్ద అనే పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్‌ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Related posts

Akhanda Movie Collections : ‘అఖండ’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’

Hardworkneverfail

RRR Movie : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. మూవీ మొత్తానికి సోల్ ఈ పాట..

Hardworkneverfail

Mega Star Chiranjeevi : మెగాస్టారా.. మజాకా.. ఒక నెలలోనే 4 మూవీస్.. ఆల్ టైమ్ రికార్డ్

Hardworkneverfail

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్‌’ మూవీ కోసం భారీ సెట్స్ ..?

Hardworkneverfail

Love Story: ఓటీటీలో నాగచైతన్య ‘లవ్ స్టొరీ’ మూవీ..ఎప్పుడంటే?

Hardworkneverfail