సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘మంచి రోజులు వచ్చాయి’. దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీన ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్య క్రమాలను గ్రాండ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. దాంతో ఈ మూవీకి బిజినెస్ కూడా బాగానే జరిగింది.
‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…
నైజాం | 3.00 cr |
ఆంధ్రా(మొత్తం) | 3.00 cr |
సీడెడ్ | 1.80 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 7.80 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.10 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 8.90 cr |
‘మంచిరోజులు వచ్చాయి’ మూవీకి రూ.8.9 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే దీపావళి రోజున రజినీ కాంత్ పెద్దన్న, విశాల్ ఎనిమి మూవీలు కూడా విడుదలవుతున్నాయి.వాటితో పోటీ అంటే చాలా కష్టమే…మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ తక్కువ థియేటర్స్ లో ఎంతవరకు హోల్డ్ చేసి కలెక్షన్స్ పరంగా పోటి లో ఉన్న మూవీలను తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి. సంతోష్ సినిమాలు ఇప్పటివరకు అంత కలెక్ట్ చేసింది ఏమీ లేదు. కాబట్టి పూర్తిగా మారుతీ బ్రాండ్ మీదే నడవాలి ఈ మూవీ..!
MAA Elections: నరేశ్ వల్లే ‘మా’లో ఇన్ని గొడవలు – శివాజీ రాజా