Pushpa Movie Historical Record in Tollywood : ‘పుష్ప’ మూవీకి ఏపీలో టికెట్ రేట్స్ ఇంపాక్ట్ వలన దెబ్బ పడినా కానీ నైజాం ఏరియాలో మాత్రం మూవీ రచ్చ రచ్చ చేసింది. ఈ మూవీకి నైజాం లో టికెట్ హైక్స్ భారీగా పెంచినా కానీ ఆడియన్స్ మూవీ టికెట్స్ ని ఎగబడి మరి బుక్ చేసుకున్నారు. ఫస్ట్ డే కి గాను 90% కి పైగా ఆన్ లైన్ టికెట్ సోల్డ్ ఔట్ అవ్వగా ఆఫ్ లైన్ లో కూడా అల్టిమేట్ ట్రెండ్ కొనసాగింది. నైజాం ఏరియాలో ఫస్ట్ డే ఓవరాల్ గా ఆల్ టైం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది.
ఇప్పటి వరకు నైజాం ఏరియాలో ఏ మూవీ కూడా 10 కోట్ల రేంజ్ దాటలేదు. కానీ ఇప్పుడు హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ఫస్ట్ డే ఒక్క నైజాం ఏరియా నుండే ఇప్పుడు 10 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోబోతుంది. ఇది చారిత్రిక రికార్డ్ అనే చెప్పాలి. ఓవరాల్ గా లెక్క 10 కోట్ల నంబర్ ని కూడా దాటి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఇక ‘పుష్ప’ మూవీ 36 కోట్ల బిజినెస్ ను నైజాం ఏరియాలో సొంతం చేసుకోగా లాంగ్ రన్ లో ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.