Pushpa Special on Unstoppable with NBK : బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి ఆహాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో బాలకృష్ణ ఈసారి ‘పుష్ప’ టీమ్ తో సందడి చేయించనున్నారు. ఈ ఎపిసోడ్ క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 న ఆహాలో స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన ఈ ఎపిసోడ్ వాయిదా పడింది. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించి నుంచి ప్రోమోని వదిలారు ఆహా మేకర్స్.
ఈ ప్రోమోలో పుష్ప రాజ్ తన మేనరిజం తగ్గేదేలే డైలాగ్ ని బాలకృష్ణతో కలిసి చెప్పిస్తాడు. ఇక ఈ ఎపిసోడ్ లో రష్మిక , డైరెక్టర్ సుకుమార్ కూడా సందడి చేయనున్నారు. అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి మరి.