Bright Telangana
Image default

Akhanda : భం భం అఖండ… అదరగొడుతోన్న బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ సాంగ్

Akhanda Title Song Lyrical

నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘అఖండ’. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్‌, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని మిర్యాల రవీందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన రెండు వీడియోలు, టైటిల్‌ సాంగ్‌ టీజర్‌కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి మరో సాంగ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై చేయగా.. ఇక తాజాగా ఈ పూర్తి పాటను ఈరోజు విడుదల చేశారు. ఈ పాట అఘోరా గా ఉన్న బాలయ్య‌పై చిత్రీకరణించారు. అదిరిపోయే విజువల్స్ తోడు థమన్ కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ వీడియో వైరల్ గా మారింది. అనంత శ్రీరామ్ రాసిన ఈ గీతాన్ని తన కుమారులు సిద్ధార్థ్‌, శివమ్ తో కలిసి శంకర్ మహదేవన్ అద్భతంగా గానం చేశారు. తమన్‌ సంగీత వహించారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి హిట్‌ మూవీల తర్వాత బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. దీంతో నందమూరి అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Anubhavinchu Raja Movie : ‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Jr NTR: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో తొలిసారి కోటి రూపాయలు గెలిచిందెవరో తెలుసా..?

Hardworkneverfail

Kamal Haasan: విక్రమ్‌ వచ్చేశాడు.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టిన కమల్‌ హాసన్‌

Hardworkneverfail

Skylab Movie : ఆసక్తి రేపుతోన్న నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌ ‘స్కైలాబ్’ ట్రైలర్

Hardworkneverfail

Akhanda, Shyam Singha Roy in Ott : ఓటీటీలోకి వచ్చేసిన ‘అఖండ’, ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

‘అఖండ’ మూవీ బెనిఫిట్ షో ఎఫెక్ట్.. ఏపీలో రెండు థియేటర్లు సీజ్‌

Hardworkneverfail