Bright Telangana
Image default

Kamal Haasan: విక్రమ్‌ వచ్చేశాడు.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టిన కమల్‌ హాసన్‌

విక్రమ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టిన కమల్‌ హాసన్‌

కమల్‌ హాసన్‌ బర్త్ డే కానుక వచ్చింది. అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తాను నటిస్తున్న విక్రమ్‌ మూవీ నుంచి ఫస్ట్ గ్లాన్స్ విడుదల చేశారు. ఇందులో కమల్‌ హాసన్‌ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. 48 సెకన్ల నిడివి గల వీడియో ఇప్పుడు దుమ్మురేపుతుంది. ఓ జైల్లో నుంచి తప్పించుకుంటున్న క్రమంలో పోలీసులు వెంటపడుతుంటారు. కాల్పులు జరుపుతుంటారు. పోలీస్‌ రక్షణ కవచాలను అడ్డుపెట్టుకుని ఒక్కసారిగా ఓపెన్‌ చేసి తనదైన యాక్షన్‌ లుక్‌తో కమల్‌ ఎంట్రీ అదిరిపోయేలా ఉంది.

ఖైది, మాస్ట‌ర్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ మూవీల‌తో స్టార్‌ డైరెక్టర్‌గా పేరు సంపాదించిన లోకేశ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. అంతేకాకుండా దాదాపు మూడేళ్ల అనంతరం క‌మ‌ల్ హాస‌న్ చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై హైప్‌ నెలకొంది. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో పాటు మళయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts

పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్: ప్రకాశ్ రాజ్

Hardworkneverfail

Shyam Singha Roy : నాని మూవీ టీజర్ ఎప్పుడంటే..

Hardworkneverfail

RRR Movie : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. మూవీ మొత్తానికి సోల్ ఈ పాట..

Hardworkneverfail

సల్మాన్ ఖాన్ అభిమానుల పిచ్చి పీక్స్ ..థియేట‌ర్‌లోనే బాణ‌సంచా కాల్చిన ఫ్యాన్స్‌

Hardworkneverfail

Mega 154 Pooja Ceremony : మెగాస్టార్‌ కోసం స్టార్ డైరెక్టర్స్ తరలి వచ్చారు

Hardworkneverfail

Acharya Movie : మెగా అభిమానులకు పండగే..ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది

Hardworkneverfail