సిద్దార్థ్, శర్వానంద్ లు హీరోలుగా రూపొందిన మూవీ ‘మహా సముద్రం’. అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ మూవీ విడుదల అయ్యింది. సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ఈ మూవీ కలెక్షన్లు రెండో రోజు దారుణంగా పడిపోయాయి. మూవీ మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టగా రెండో రోజు నుండి పోటి తట్టుకోలేక పోయింది. మొత్తం మీద సినిమా మొదటి 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని ఇప్పుడు అతి కష్టమైన కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుంది.. బ్రేక్ ఈవెన్ దృశ్యా ఇవి సరిపోవు అనే చెప్పాలి.
మహా సముద్రం మూవీ స్ట్ వీకెండ్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చిన షేర్ :
నైజాం | 1.81 cr |
ఉత్తరాంధ్ర | 0.83 cr |
సీడెడ్ | 1.04 cr |
ఈస్ట్ | 0.43 cr |
వెస్ట్ | 0.32 cr |
గుంటూరు | 0.63 cr |
నెల్లూరు | 0.29 cr |
కృష్ణా | 0.40 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 5.75 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.59 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 6.34 cr |
‘మహా సముద్రం’ మూవీకి రూ.16.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.6.34 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.10 కోట్ల పైనే షేర్ ను రాబట్టాలి.