డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా ట్రై చేసిన ఆంధ్రా పోరీ నిరాశ పరచగా తర్వాత చేసిన మెహబూబా సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు పూరీ నిర్మాణంలో అనిల్ పదురి అనే కొత్త డైరెక్టర్ తో కలిసి చేస్తున్న మూవీ రొమాంటిక్. ‘అక్టోబర్ 29న విడుదల అయిన ఈ మూవీకి యవరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ ఇంటర్వ్యూ కూడా చేయించడం మరియు యూనిట్ సభ్యులు ప్రమోషన్లు భారీగా నిర్వహించడం వలన ఈ మూవీ పై కుర్రాళ్ళకి ఆసక్తిని పెంచేలా చేసాయి. దాంతో డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది ఈ మూవీ.
‘రొమాంటిక్’ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
నైజాం | 1.09 cr |
ఉత్తరాంధ్ర | 0.36 cr |
సీడెడ్ | 0.58 cr |
ఈస్ట్ | 0.23 cr |
వెస్ట్ | 0.17 cr |
గుంటూరు | 0.24 cr |
నెల్లూరు | 0.14 cr |
కృష్ణా | 0.19 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 3.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.16 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 3.16 cr |
‘రొమాంటిక్’ మూవీకి వరల్డ్ వైడ్ గా రూ.4.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.3.16 కోట్ల షేర్ ను రాబట్టింది. మరో రూ.1.64 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించడం సాధ్యమవుతుంది. వర్కింగ్ డేస్ లో మూవీ మినిమం హోల్డ్ చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది.