తెలుగు సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘ఆచార్య’. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదల వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూనే చిత్రంలో ఎంతో కీలకమైన సిద్ద అనే పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఇదిలా ఉంటే.. దీపావళి కానుకగా.. ఈ మూవీ నుంచి నీలాంబరీ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది మూవీ యూనిట్. నీలాంబరీ.. నీలాంబరీ.. లేరేవ్వరే నీలామరీ.. నీలాంబరీ.. నీలాంబరీ.. నీ అందమే నీ అల్లరి అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్.. పూజా హెగ్డే లుక్స్ అభిమానులు ఆకట్టుకోవడమే కాకుండా.. రామ్ చరణ్ స్టెప్పులు సైతం అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ పాట పూర్తి వీడియోను రేపు (నవంబర్ 5న) ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నారు.
MAA Elections: నరేశ్ వల్లే ‘మా’లో ఇన్ని గొడవలు – శివాజీ రాజా