Shyam Singha Roy 16 Days Collections : నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాల ను పూర్తీ చేసుకుని 3 వ వారంలో ఎంటర్ అయ్యింది. ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీకి ఆడియన్స్ నుండి రిలీజ్ అయిన రోజే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కానీ వీకెండ్స్ లో బాగానే పెర్ఫార్మ్ చేసిన మూవీ వర్కింగ్ డేస్ లో మాత్రం గట్టిగానే స్లో డౌన్ అవుతూ వచ్చింది అని చెప్పాలి.
‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 15 వ రోజు తో పోల్చితే 16 వ రోజు తెలుగు రాష్ట్రాలలో మరోసారి 3 లక్షల గ్రోత్ ని సొంతం చేసుకుని 11 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.
నైజాం | 9.42 cr |
ఉత్తరాంధ్ర | 2.16 cr |
సీడెడ్ | 2.70 cr |
ఈస్ట్ | 1.11 cr |
వెస్ట్ | 0.85 cr |
గుంటూరు | 1.19 cr |
నెల్లూరు | 0.64 cr |
కృష్ణా | 0.98 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 19.06 cr (32.36CR Gross) |
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.95 cr |
ఓవర్సీస్ | 3.62 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 25.62 cr (44.82CR Gross) |
22.5 కోట్ల టార్గెట్ మీద ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 3.12 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. Shyam Singha Roy Collections