Shyam Singha Roy 1st Day Collections : నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా మూవీకి మంచి టాక్ లభించింది అని చెప్పాలి. కానీ మూవీకి ఆంధ్రలో టికెట్ రేట్స్ ఎఫెక్ట్ తో మరీ అనుకున్న రేంజ్ లో రిలీజ్ ను సొంతం చేసుకోలేక చాలా నార్మల్ గా రిలీజ్ అవ్వగా మూవీ బిజినెస్ కూడా చాలా ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా నైజాంలో 8 కోట్లు, సీడెడ్ లో 2.5 కోట్లు, టోటల్ ఆంధ్రప్రదేశ్ లో 6 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్ లో 3.5 కోట్ల దాకా ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 22 కోట్ల దాకా ఉంది. దాంతో ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ రూ. 22.5 – 23 కోట్ల రేంజ్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.
‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
నైజాం | 2.13 cr |
ఉత్తరాంధ్ర | 0.51 cr |
సీడెడ్ | 0.63 cr |
ఈస్ట్ | 0.20 cr |
వెస్ట్ | 0.16 cr |
గుంటూరు | 0.26 cr |
నెల్లూరు | 0.12 cr |
కృష్ణా | 0.18 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 4.20 cr (6.92CR Gross) |
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.30 cr |
ఓవర్సీస్ | 1.35 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 6.85 cr (12Cr Gross) |
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే వెరీ లిమిటెడ్ రిలీజ్ వలన ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ రూ. 4.20 కోట్లు రాబట్టింది. ఒకసారి టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22.5 కోట్లు కాగా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా రూ. 15.65 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఆంధ్రలో అన్నీ అనుకూలంగా ఉండి ఉంటే ఇంకా 30% కలెక్షన్స్ పెరిగి ఉండేవి, ఆ ఇంపాక్ట్ ఉన్నా ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి.