అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ‘జీఏ2 పిక్చర్స్’ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అయ్యింది. దసరా సెలవు కూడా కలిసి రావడంతో సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ ఫస్ట్ వీకెండ్ వచ్చిన షేర్ :
నైజాం | 5.41 cr |
సీడెడ్ | 2.94 cr |
ఈస్ట్ | 0.86 cr |
వెస్ట్ | 0.70 cr |
ఉత్తరాంధ్ర | 1.67 cr |
గుంటూరు | 1.03 cr |
నెల్లూరు | 0.61 cr |
కృష్ణా | 0.80 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 14.02 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.22 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 17.24 cr |
అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీకి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఇంకా 1.76 కోట్ల షేర్ వస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. వర్కింగ్ డేస్ లో మిగిలిన మొత్తాన్ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి.