సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘మంచి రోజులు వచ్చాయి’. దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలయ్యింది. అప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. దాంతో ఈ మూవీకి బిజినెస్ కూడా బాగానే జరిగింది. కానీ మూవీ మెప్పించలేకపోయింది. దాంతో ఓపెనింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి.
‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ ఫస్ట్ వీకెండ్ లెక్కలను గమనిస్తే…
నైజాం | 0.79 cr |
ఉత్తరాంధ్ర | 0.22 cr |
సీడెడ్ | 0.35 cr |
ఈస్ట్ | 0.17 cr |
వెస్ట్ | 0.11 cr |
గుంటూరు | 0.16 cr |
నెల్లూరు | 0.10 cr |
కృష్ణా | 0.14 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 2.04 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.25 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 2.29 cr |
‘మంచిరోజులు వచ్చాయి’ మూవీకి రూ.8.9 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫస్ట్ వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి కేవలం రూ.2.29 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో 6.71 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇది కష్టమే అని చెప్పాలి.