Bright Telangana
Image default

RRR Release Date: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

RRR Release Date: RRR: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ (రౌద్రం రణం రుధిరం). పరిస్థితులు బాగుంటే ఇప్పటికే విడుదలై, ప్రేక్షకుల్ని అలరించి ఉండేది క్రేజీ మల్టీస్టారర్‌ చిత్రం ‘RRR’. కొవిడ్‌ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతోన్న సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి ఈ సినిమాలో చూపించనున్నాడు జక్కన. ఇక ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు జక్కన.. ప్రస్తుతం షూటింగ్ అనంతరం పనులు జరుపుకుంటుంది ఈ సినిమా.

ఇక సినిమాలో చరణ్, ఎన్టీఆర్‌కు జోడీగా అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ నటిస్తున్నారు. వీళ్లతో పాటు అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, అలీ కీ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. ఇక పోతే దసరా కానుకగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’సినిమా వరల్డ్‌ వైడ్‌గా అక్టోబరు 13న విడుదల చేయాలనీ మేకర్స్ సన్నాహాలు చేశారు.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మార్చారు మేకర్స్.. జనవరి 7, 2022న ‘RRR’ విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ పోస్టర్ లో తారక్, చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ కనిపిస్తున్నారు.

Related posts

RRR Movie : విజువల్ వండర్.. అంచనాలను ఆకాశానికి చేర్చిన ఫస్ట్ గ్లింప్స్..

Hardworkneverfail

Chiranjeevi: త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మెగాస్టార్‌ .. త్వరలోనే అధికారిక ప్రకటన..

Hardworkneverfail

RRR PRE Release Event : ‘ఆర్ఆర్ఆర్’ కోసం.. చిరంజీవి.. బాలయ్య..?

Hardworkneverfail

Pushpa : ‘మంగళం శ్రీను’గా భయపెడుతున్న సునీల్

Hardworkneverfail

Acharya Movie Postponed : ‘ఆచార్య’ విడుదల వాయిదా..

Hardworkneverfail

RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి కు రెండు రిలీజ్ డేట్స్..

Hardworkneverfail