RRR Team Confirms Two New Release Dates : దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్ లో భారీగా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 3rd వేవ్ ఎంటర్ అవ్వడంతో ఇక తప్పక మరోసారి పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది.
ఇక మూవీ ఎప్పుడు వస్తుందో అన్న క్లారిటీ కూడా లేని టైం లో ఒకటి కాదు ఏకంగా రెండు రిలీజ్ డేట్లు ప్రకటించి ఔరా అనిపించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితులు త్వరలో అన్నీ సద్దుకుంటే మార్చ్ 18న ఆర్ఆర్ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతుందని లేక పరిస్థితులు సద్దుకోకపొతే మట్టుకు ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని 2 డేట్స్ ని లాక్ చేశారు మూవీ మేకర్స్. అన్నీ అనుకున్నట్లు జరిగి మొదటి డేట్ కే మార్చ్ 18న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యి రికార్డులు తిరగరాయాలని కోరుకుందాం.RRR Team Confirms
#RRRMovie on March 18th 2022 or April 28th 2022. 🔥🌊 pic.twitter.com/Vbydxi6yqo
— RRR Movie (@RRRMovie) January 21, 2022