RRR Pre Release Event : ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తోంది సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కానున్న ఈ మూవీ ఈవెంట్ ను భారీగా నిర్వహించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ వేడుకలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక అక్కడే అలా ఉంటే తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు భారీ మల్టీస్టారర్ మూవీ అంతకుమించి అన్నట్లుగా నిర్వహించేందుకు ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి లను ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సివుంది.
రామ్ చరణ్, ఎన్టీఆర్, బాలయ్య, మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవగన్, అలియా భట్ అజయ్ దేవగన్, అలియా భట్ వంటి ప్రముఖులు ఈ ఈవెంట్ లో సందడి చేయనున్నారు. దీంతో భారీ తారాగణం మధ్య జరగబోయే ఈవెంట్లో అభిమానుల తాకిడి తట్టుకోవడం సాధ్యమా అని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.