Bright Telangana
Image default

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ త్వరలోనే ఇంటికి తిరిగివస్తారు : చిరంజీవి

కైకాల సత్యనారాయణ త్వరలోనే ఇంటికి తిరిగివస్తారు : చిరంజీవి

సీనియర్ నటుడు, నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ (88) ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తుండగా అపోలో వైద్యులు కైకాలహెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కైకాల శనివారం ఉదయం తీవ్ర జ్వరం.. శ్వాస ఇబ్బందితో అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల ఆరోగ్యంపై పాజిటివ్‌గా ట్వీట్ చేశారు. కైకాల త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతుడవుతారనే నమ్మకం ఉందని చెప్పారు.

‘ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ గారు స్పృహలోకి వచ్చారని తెలియగానే, ఆయన్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ సుబ్బారెడ్డిగారి సహాయంతో ఆయన్ని ఫోన్ లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారనే పూర్తి నమ్మకం కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, మళ్ళీ త్వరలో ఇంటికి రావాలని, ఈ సందర్భాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని, నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్ అప్ సైగచేసి, థాంక్యూ అని చూపించినట్టు గా సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితోనూ ఈ విషయం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది’. అని చిరంజీవి తెలిపారు.

Related posts

Arjuna Phalguna Teaser : శ్రీవిష్ణు ‘అర్జున ఫాల్గుణ’ టీజర్ అదిరిందిగా..

Hardworkneverfail

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’

Hardworkneverfail

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail

Nagarjuna on Chiru, CM Jagan Meet : చిరు, జగన్ భేటీకి నాగార్జున ఎందుకు వెళ్ళలేదు ?

Hardworkneverfail

Mega 154 Pooja Ceremony : మెగాస్టార్‌ కోసం స్టార్ డైరెక్టర్స్ తరలి వచ్చారు

Hardworkneverfail