RRR Movie OTT Release : రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన మల్టీ స్టార్రర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 9న విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ మూవీ ట్రైలర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల అంచనాల మేరకు ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే విషయంపైనా పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ 4 వారాల్లోనే ఓటీటీల్లో వచేస్తున్నాయి. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ కూడా నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తుందని చాలా మంది భావించారు.. కానీ షాకిచ్చే న్యూస్ చెప్పారు మూవీ మేకర్స్. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ థియేటర్లలో విడుదలైన 3 నెలల వరకు ఓటీటీలో విడుదల కాదని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆల్ లాంగ్వేజెస్ హక్కులను దక్కించుకుంది. తెలుగు ఓటీటీ హక్కులను జీ5 మరియు హిందీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.