Bright Telangana
Image default

Shiva Shankar Master : కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత..

Shivashankar Master death

గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతు పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్‌(73) కన్నుమూశారు. కరోనా సోకిన తర్వాత హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ కన్నుమూశారు. ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా సోకడంతో కాపాడలేకపోయారు వైద్యులు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్య, పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకింది. ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి, సోనూసూద్, హీరో ధనుష్, మంచు విష్ణు, లారెన్స్ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు. శివ శంకర్ మాస్టర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమలో 10 భాషల్లో పనిచేసిన అనుభవం శివశంకర్ మాస్టర్ సొంతం. 800 పైగా సినిమాలకు కొరియోగ్రఫీ అందించారాయన. దాదాపు 30 సినిమాల్లో నటించారు కూడా. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న శివశంకర్‌ మాస్టర్‌.. చెన్నైలో పుట్టారు. సలీమ్‌ మాస్టర్‌ దగ్గర శిష్యరికం చేశారు. 2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని, నాలుగుసార్లు తమిళనాడు స్టేట్‌ అవార్డు అందుకున్నారు శివశంకర్ మాస్టర్.

Related posts

Anubhavinchu Raja Movie : ‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpa Movie: ‘పుష్ప’ మూవీ స్పెషల్ సాంగ్ నుంచి సమంత సిజ్లింగ్ పోస్టర్ రిలీజ్..

Hardworkneverfail

మెగాస్టార్ చిరంజీవి మూవీలో సల్మాన్‌ఖాన్‌.. బ్రిట్నీ స్పియర్స్‌తో అదిరిపోయే పాట

Hardworkneverfail

Peddanna Collections: డిజాస్టర్ దిశగా ‘పెద్దన్న’…పెద్దన్న మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

Maha Samudram Closing Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మహా సముద్రం’

Hardworkneverfail

Skylab Movie : ఆసక్తి రేపుతోన్న నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌ ‘స్కైలాబ్’ ట్రైలర్

Hardworkneverfail