సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మూవీ ”అన్నాత్తే”. మాస్ డైరెక్టర్ సిరుతై శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగులో ”పెద్దన్న” అనే పేరుతో విడుదలయ్యింది. రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీని దీపావళి కానుకగా నవంబరు 4న విడుదలయ్యింది. ఈ మూవీకి తెలుగులో మంచి బిజినెస్ జరిగింది, కానీ కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. తెలుగులో అమ్మిన రేటు దృశ్యా కలెక్షన్స్ ఏ దశలో కూడా బిజినెస్ ను అందుకునే రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి.
‘పెద్దన్న’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ టోటల్ కలెక్షన్స్ (షేర్)ని గమనిస్తే….
నైజాం | 1.40 cr |
ఉత్తరాంధ్ర | 0.41 cr |
సీడెడ్ | 0.68 cr |
ఈస్ట్ | 0.29 cr |
వెస్ట్ | 0.23 cr |
గుంటూరు | 0.41 cr |
నెల్లూరు | 0.19 cr |
కృష్ణా | 0.27 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 3.88 cr |
‘పెద్దన్న’ మూవీకి రూ.12.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ 12.5కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ మూవీ కేవలం రూ 3.88 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.8.62 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్(షేర్)ని గమనిస్తే…
తమిళనాడు | 45.40 cr |
కర్ణాటక | 4.95 cr |
ఏపీ + తెలంగాణ | 3.88 cr |
కేరళ | 1.30 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.70 cr |
ఇండియా (మొత్తం) | 57.23 cr |
ఓవర్సీస్ | 17.40 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 74.63 cr |
ఫస్ట్ వీక్ 140 కోట్ల గ్రాస్ మార్క్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని సంచలనం సృష్టించింది ఈ మూవీ… డిసాస్టర్ రేటింగ్ లతో కూడా ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ రాంపేజ్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా అక్కడ ఎంత దూరం వెళుతుందో చూడాలి ఇక.