Bright Telangana
Image default

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన బాబు మోహన్

babu-mohan-controversial-comments-on-pawan-kalyan

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై సీనియర్ నటుడు బాబూ మోహన్ ఘాటుగా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) ఎన్నికలలో మంచు విష్ణు ప్యానల్ తరపున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ పోటీ చేస్తున్నారు. మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

”ప్రభుత్వ సహకారం ఇండస్ట్రీకి అవసరం. ఏపీ ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ఓ విషయం అడిగారు. దానికి వాళ్ళు సరే అన్నారు. దాన్ని విమర్శించి అది చిన్నోళ్లకు ఉపయోగపడుతుంది పెద్దోళ్లకు ఉపయోగపడదు అంటూ పవన్ ఏదేదో మాట్లాడారు. పవన్ కల్యాణ్ అన్ని మాటలు మాట్లాడారు కదా.. ఆయన తేల్చుకోవాలి.. ఇండస్ట్రీ బాగుంటే మనందరం బాగుంటాం. ఆయన ఇండస్ట్రీ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా? అనేది ముందుగా తేల్చుకోవాలి అని బాబు మోహన్ అన్నారు. అక్కడి తో ఆగకుండా ”నీ వ్యక్తిగతమా? నీ సొమ్ము తిన్నాడా? నీ రెమ్యూనరేషన్ గుంజుకున్నాడా? నీ అవకాశాన్ని తీసుకున్నాడా? ఎందుకయ్యా నీకు అంత ఫ్రస్ట్రేషన్. ఓ అంటూ ఊగిపోవడం ఎందుకు? చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు కదా. ఏదో నీ ఇల్లు గుంజుకొని ఇల్లు కాలబెట్టి.. నీ బ్యాంక్ బ్యాలన్స్ అంతా తీసుకున్నట్లు. పది పైసల నష్టం అయినా జరిగిందా నీకు? వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల మన సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది. సినిమా యాక్టర్స్ అంటే ఇదా అని అందరూ అంటున్నారు. నీకు అంత పెద్ద అవమానం – అన్యాయం – ద్రోహం జరిగితే ఎందుకు పెద్ద మనుషులతో కూర్చొని సాల్వ్ చేసుకోకూడదు?” అని అన్నారు.

Related posts

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ నుంచి వచ్చేస్తున్న ఫోర్త్ సింగిల్!

Hardworkneverfail

RRR Movie : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. మూవీ మొత్తానికి సోల్ ఈ పాట..

Hardworkneverfail

Samantha: సమంత ఐటెంసాంగ్.. ‘పుష్ప’ టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Hardworkneverfail

Jr NTR: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో తొలిసారి కోటి రూపాయలు గెలిచిందెవరో తెలుసా..?

Hardworkneverfail

Major Movie: అడివి శేష్ ‘మేజర్’ మ్యూజిక్ రైట్స్ వారికే..

Hardworkneverfail

Nagarjuna : టికెట్ ధరల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. నాగార్జున

Hardworkneverfail