Bheemla Nayak 4th Song Update : పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యా మీనన్.. రానా కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ – ఇద్దరు హీరోల గ్లిమ్స్ – టైటిల్ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి కారణంగా వాయిదా పడిన భీమ్లా నాయక్ 4th సింగిల్ ‘అడవి తల్లి మాట’ను విడుదల చేసే వివరాలను తాజాగా మూవీ యూనిట్ ప్రకటించింది. శనివారం ఉదయం 10 గంటల 08 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మూవీ యూనిట్ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది.. ఈ విషయాన్ని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ కు సంబదించిన పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ తీక్షణంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు. అతనిలో అడవి కనిపిస్తోంది. ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ మరోసారి మూవీని జనవరి 12నే విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.