భీమ్లా నాయక్ : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్‌గా వీడియో ప్రోమో విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్‌లో ‘లాలా భీమ్లా’ అనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినీ అభిమానుల్ని ఎంతగానో అలరించింది. ఈ ప్రోమో వీడియోలో పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను కూడా చెప్పారు. మీకు హ్యాపీ కంగ్రాచ్యులేషన్స్ అండీ.. మీకు దీపావళి ముందుగానే వచ్చేసింది అంటూ.. మంచి మాస్ ఎలిమెంట్స్‌ని ప్రోమోలో చూపించారు. ఈ పూర్తి సాంగ్ 07 నవంబర్ 2021 విడుదల కానుంది.
మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ రూపొందుతోంది. నిత్య మేనన్, సంయుక్త మేనన్ కథానాయికలు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.