శనివారం అనంతపురం జిల్లా, పుట్టపర్తి నుండి ధర్మవరం వెళ్లే మార్గంలోని కొత్త చెరువు గ్రామం వద్ద శిథిలావస్థకు గురైన రోడ్లను మరమ్మత్తు చేయకుండా వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేయడంతో, నిసన తెలియజేస్తూ గాంధేయ మార్గంలో శ్రమదానం ద్వారా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మరమత్తులు చేపడతాను అని పిలుపునివ్వడంతో, ఎక్కడ ప్రజలకు తమ ప్రభుత్వ వైఫల్యం గురించి పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తారో అని, ఇన్ని రోజులు చలనం లేనట్లుగా ప్రవర్తించిన వైసీపీ ప్రభుత్వం హుటాహుటిన రోడ్ల మరమ్మత్తులు మొదలు పెట్టి, రహదారి పొడవునా తాత్కాలికంగా, నాసిరకం మెటీరియల్ తో గోతులు పూడ్చుతూ తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
ఇన్నిరోజులు టెండర్లకు ఎవరు ముందుకు రావట్లేదు, వర్షాలు పడుతున్నాయి అని సాకులు చెప్పిన వైసీపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ రాకతో అప్రమత్తమై తమ తప్పులు కప్పిపుచ్చుకుని, ప్రజలను మోసం చేసే ప్రయత్నమే ఈ రాత్రికి రాత్రి వెలసిన నాసిరకం రోడ్లు అని, జనసేనాని వస్తే పెద్ద ఎత్తున రోడ్ల దుస్థితిపై ఉద్యమం చేసి ప్రజల్లో చైతన్యం సృష్టిస్తారని, ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించి నష్టానివారణ చర్యల క్రింద మాత్రమే ఈ రోడ్లు వేస్తున్నారనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అయితే కేవలం జనసేన పార్టీ రోడ్లపై పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ చేసి, 4 వారాల అల్టిమేటం ఇచ్చి శ్రమదానానికి వస్తాను అని చెప్పినందుకు పవన్ కళ్యాణ్ గారు వచ్చే 2 రోజుల ముందు రోడ్లకు మెరుగులు అడ్డుతున్నారు తప్పించి నిజంగా రోడ్లను బాగుచేయాలనే చిత్తశుద్ధి లేదు అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు.