First Day First Show Trailer Out Now : కామెడీ మూవీ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’కి ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ కెవి కథను అందించాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ తో ప్రిన్స్ అనే మూవీ తీస్తున్న అనుదీప్ మరోపక్క ఈ మూవీతో రచయితగా కూడా మారాడు. ఈ కామెడీ మూవీకి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌కు చెందిన శ్రీజ ఎడిద నిధులు సమకూరుస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్‌ని ఒకరినొకరు ఎక్కువగా ఆరాధించే యువకులుగా, శ్రీకాంత్ రెడ్డి మరియు సంచితా బాషు ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీధర్ గౌడ్ మరియు లక్ష్మీ నారాయణ పి కలిసి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్ శ్రీను, మహేష్ ఆచంట మరియు శ్రీనివాసరెడ్డి కూడా నటించారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తుంది. నేపథ్య సంగీతాన్ని రధన్ రాశారు.