Bright Telangana
Image default

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ ‘పవర్ గ్లాన్స్ పవర్ ఫుల్ ‘ గా వుంది..

Hari Hara Veera Mallu Movie

Hari Hara Veera Mallu Power Glance : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు వీడియో వచ్చేసింది. ఈరోజు సెప్టెంబ‌ర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా హరిహర వీరమల్లు మేకర్స్ అభిమానులకు బర్త్ డే కానుకను ఇచ్చారు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. అయితే మూవీ షూటింగ్‌ ప్రారంభ‌మై నెల‌లు గడుస్తున్నా ఈ మూవీ సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ల‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించడం లేదు. దాంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ మేక‌ర్స్‌పై తీవ్ర ఆస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా పవర్ గ్లాన్స్ ని శుక్రవారం ఉదయం విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. ‘దిగొచ్చింది భల్లు భల్లున…పిడుగే దిగొచ్చింది భలల్లు భల్లున.. మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో.. తెలుగోడు!’ అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ తో విడుదల చేసిన పవర్ గ్లాన్స్ పవర్ ఫుల్ గా వుంది.

మీసం తిప్పి తొడగొట్టిన ఓ తెలుగోడుగా పవన్ కళ్యాణ్ మల్లయోధులను మట్టి కరిపించిన తీరు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. భారీ స్థాయిలో నిర్మించిన సెట్ లో వందలాది జనాల మధ్య పవన్ కళ్యాణ్ మల్లయోధులని మట్టికరిపించే సీన్ టెర్రిఫిక్ గా వుంది. ఈ ఒక్క సీన్ చాలుమూవీని ఎంత గ్రాండీయర్ గా మేకర్స్ తెరకెక్కిస్తున్నారో అర్ధం అవుతుంది. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీ వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నాడు. ఎమ్‌. ఎమ్ కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Related posts

Bheemla Nayak: త్రివిక్రమ్‌కి భీమ్లా నాయక్‌ టీమ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌..అరుపులు పుట్టిస్తున్న టైటిల్ సాంగ్

Hardworkneverfail

Bheemla Nayak: రాజమౌళి భోరు పడలేక సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్..!

Hardworkneverfail

Pawan Kalyan Reacts Strongly : చట్టసభలు బూతులు తిట్టడానికి కాదు.. పవన్ కళ్యాణ్

Hardworkneverfail

Bheemla Nayak Movie Total Business : ‘భీమ్లా నాయక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్..!

Hardworkneverfail

Bheemla Nayak Movie Postponed : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ .. భీమ్లా నాయక్ వాయిదా..?

Hardworkneverfail

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన బాబు మోహన్

Hardworkneverfail