అమరావతి(ఆంధ్రప్రదేశ్) : అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరిని వైఎస్సార్‌సీపీ నేతలు దూషించిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. సభను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చట్టాలు చేయాలంటే చట్టాలు చేయాల్సిందే కానీ, దూషించే పదజాలం అది కాదని అన్నారు.
ప్రజా ప్రతినిధులు ఈ స్థాయికి దిగజారితే సమాజంలో ఆడబిడ్డలకు భద్రత ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజంలోని దోషులను మహిళలపై నేరాలు చేసేలా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.