Bright Telangana

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నిర్మాతలు విచారం వ్యక్తం చేశారు: ఏపీ మంత్రి పేర్నినాని

టాలీవుడ్ నిర్మాతలు దిల్‌రాజు, సునీల్‌ నారంగ్‌, డీవీవీ దానయ్య, బన్నీవాసుతో పాటు మరికొందరు కలిసి ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం.. పేర్నినాని మాట్లాడుతూ.. ‘నన్ను కలవాలని నిర్మాతలు నిన్న అడిగారు.. ఇండస్ట్రీకి నష్టం జరిగే సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని నాతో మాట్లాడాలి అన్నారు. ఇండస్ట్రీ అంతా ఒక్కమాటపై ఉన్నాము.. ఇదే మాట సీఎం జగన్ కు చెప్పండి అని కోరారు. ఆన్లైన్ టికెట్లపై మేము అనుకూలం అని నిర్మాతలు చెప్పారు. ఇప్పటికే పోర్టల్స్ నుంచి ఆన్లైన్ లో టికెట్ల అమ్మకం జరుగుతుంది. కొన్ని చోట్ల 90 శాతం ఆన్లైన్ లో అమ్ముతున్నారు. ప్రభుత్వం నిర్వహించిన గత మీటింగ్ పై అందరూ సంతృప్తిగా ఉన్నారు. మాతో చెప్పకుండా ఒక నటుడు మాట్లాడారని నిర్మాతలు అభిప్రాయపడ్డారు. పవన్ వ్యాఖ్యలకు మేము అంతా బాధపడ్డాం.. పవన్ వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదని నిర్మాతలు చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై ఈ భేటీలో నిర్మాతలు విచారం వ్యక్తం చేశారు’ అంటూ పేర్ని నాని తెలిపారు.

Related posts

Bheemla Nayak 1st Day Total Collections : ‘భీమ్లా నాయక్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..

Hardworkneverfail

Bheemla Nayak: అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ‘లాలా భీమ్లా’ వీడియో ప్రోమో అదిరింది!

Hardworkneverfail

Minister Perni Nani Press Meet : మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్

Hardworkneverfail

MLC Ananthababu: హత్య కేసులో జైలుకెళ్లి బెయిల్‌పై వస్తే దండలేసి ఊరేగించడమేంటి?

Hardworkneverfail

Pawan Kalyan : ఓటమి భయంతోనే.. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి : పవన్ కళ్యాణ్

Hardworkneverfail

Bheemla Nayak Trailer : ‘నాయక్.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’.. భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్

Hardworkneverfail