Bheemla Nayak: పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ”భీమ్లా నాయక్”. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యా మీనన్.. రానా కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ – ఇద్దరు హీరోల గ్లిమ్స్ – టైటిల్ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ క్రమంలో నేడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కానుకగా ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి టైటిట్ సాంగ్‌ను రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఆదివారం ఉదయం మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు లిరిక్స్ త్రివిక్రమ్ అందించగా… అరుణ్ కౌండిన్య ఆలపించాడు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.