Bheemla Nayak Release Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన యాక్షన్ – థ్రిల్లర్ మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీ నుండి ఈరోజు (ఫిబ్రవరి 23) మరో కొత్త ట్రైలర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. మొదట రిలీజ్ చేసిన ట్రైలర్ కంటే ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ (Bheemla Nayak Release Trailer) అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25, 2022న విడుదల కానుంది, ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ మూవీ టీమ్ ప్రమోషన్‌లో బిజీగా ఉంది.
మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ అయిన ‘భీమ్లా నాయక్’కు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుంది. సూర్యదేవర నాగవంశీ తన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమన్ ఎస్.ఎస్. సంగీతం అందించాడు.