జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశంలో మరోసారి వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024లో ప్రభుత్వం మారడం ఖాయం.. 151 సీట్లు వచ్చిన వైసీపీకి 15 సీట్లే రావచ్చునని పవన్ తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఢంకా బజాయించి గెలుస్తుంది. అప్పుడు పాండవుల సభ ఎలా ఉంటుందో చూపిస్తా.. వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నా. ఏం చేస్తారో చేసుకోండి. తాటతీసి మోకాళ్ల మీద నించోబెడతా.. ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటా.. కాకినాడలో మా ఆడపడుచు మీద చేయి వేశారు. ప్రతి ఒక్కటి గుర్తుంది. మీరు బీహార్ నుంచి కిరాయి రౌడీలను తెప్పించుకోండి.. మేం భయపడతాం’ అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను హెచ్చరించారు.
‘ఎంత సేపు రాజకీయం రెండు కులాల మధ్యనేనా..? మిగతా వాళ్ల పరిస్థితేంటీ..? వాళ్లకు అధికారం వద్దా..? ఒక్క కులమే శాసిస్తామంటే సరికాదు.. అందరూ ఉండాలి. అధికారం లేని అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుంది. వైసీపీ కక్ష కట్టి కమ్మ వారిపై దాడి చేయడం సమంజసమా..? కశ్మీర్లో పండిట్లను తరిమేసినట్టు.. ఓ జాతిని రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారు. దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టిన పరిస్థితి వచ్చిందంటే.. మీరిక రాష్ట్రంలో ఉండకూడదు’ అంటూపవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.