RRR Movie Promotions at Bigg Boss 15 Hindi : సల్మాన్ ఖాన్, అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి సరదా వీడియో వైరల్ అవుతుంది. అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR Movie జనవరి 7, 2022న విడుదల కావాల్సి ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వివిధ మాధ్యమాల్లో ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ 15 సెట్‌లో అతిథులుగా హాజరయ్యారు.
హోస్ట్ సల్మాన్ ఖాన్ వారిని పలకరించారు. అంతేకాదు హోస్ట్ సల్మాన్ ఖాన్‌కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫేమస్ నాచో నాచో స్టెప్ నేర్పించారు. ఈ ఎపిసోడ్ ఈరోజు టెలికాస్ట్ కానుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతాలలో ప్రమోషన్ వీడియోను పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ తో పాటు అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.