Brahmastra Movie : బాలీవుడ్‌లో పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ రాబోతుండగా, ఈ మూవీ తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాక్ స్టార్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘నంది అస్త్ర’ పవర్ ఉన్న అనీష్ శెట్టి పాత్రలో కనిపించనున్నారు.
‘సహస్ర నదీం సమరాట్యం, హే నంది అస్త్రం, ఖండ ఖండం కురు, మం సహక్యం మం సహక్యం’ అంటే ఒక చేతికి వేయి నంది బలం ఉంటుంది. కాగా, ఇటీవల ‘బ్రహ్మాస్త్రం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, ఎస్ఎస్ రాజమౌళి విశాఖపట్నం విచ్చేశారు.
బ్రహ్మాస్త్ర మూవీ (Brahmastra Movie) ట్రైలర్‌ను జూన్ 15 న విడుదల చేయనున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది.
Brahmāstra is a world of Wonder & power
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 11, 2022
I am proud to be a part of that wonder and hold its power in my hand with the might of the NANDI ASTRA!
thank u Ayan for making me a part of your world,passion & your endlesss energy!
Trailer on June 15th.
Brahmāstra on September 9th. pic.twitter.com/ddvJqLLJtz