Bright Telangana
Image default

Bigg Boss 5 Telugu: సన్నీపై నాగార్జున ఫైర్..

బిగ్‏బాస్ 5

బిగ్ బాస్ హౌస్‌.. కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో షణ్ముఖ్, సిరి, సన్నీకి జరిగిన గొడవతో హీటెక్కింది. కోపంలో సన్నీ మాటలు జరగా.. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా సిరి, షణ్ముఖ్ మరింత రెచ్చిపోయారు. దీంతో ఇంట్లో చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. అయితే ఈ మొత్తం రచ్చకు నాగార్జున వచ్చి ముగింపు పలికారు. రవి.. కెప్టెన్ కావడంతో ఆనీ మాస్టర్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇక షణ్ముఖ్ ఒళ్లో పడుకున్న సిరి.. అతనికి ఐలవ్వ్యూ అంటూ పలుమార్లు చెబుతూ ఏడ్చేసింది.

ఇక శుక్రవారం జరిగిన గొడవపై మానస్, సన్నీ చర్చించుకున్నారు. సిరికి కామన్‏సెన్స్ లేదని.. బ్యాడ్‏గా మాట్లాడుతుందని చెప్పుకొచ్చాడు సన్నీ. ఏ ఆడపిల్ల ఇంత గలీజ్ గా మాట్లాడం చూడలేదని మానస్ తో చెప్పుకొచ్చాడు. మరోవైపు.. షణ్ముఖ్, సిరి, రవి.. సన్నీ చేసిన రచ్చ గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక అనంతరం నాగార్జున ఇంటి సభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొదటగా ఆనీ మాస్టర్.. కాజల్‏ను జైల్లో పెట్టి తన తప్పులను చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత రవి..సన్నీని జైల్లో పెట్టి బ్యాడ్ బిహేవియర్.. సిరి, షణ్ముఖ్ లకు మద్దతు ఇచ్చాడు. అయితే సన్నీ మాట్లాడిన మాటలు కూడా తప్పు అనేట్టుగానే నాగార్జున సైతం బిహేవ్ చేశారు. ఇక షణ్ముఖ్, సిరి సైతం సన్నీని జైల్లో పెట్టి ఏకగ్రీవంగా అతడిని బ్యాడ్ బిహేవియర్ అంటూ చెప్పారు. దీంతో సన్నీ మెడలో గిల్టీ అనే ట్యాగ్ వేయించారు నాగార్జున. ఇక ఆ తర్వాత కేక్ తినడంలో సన్నీ చేసిన పని సరైనదే అని చెప్పిన నాగార్జున, చివరకు సన్నీని సేవ్ అయినట్టుగా ప్రకటించారు.

Related posts

Bigg Boss 5 Telugu Promo : ఆసక్తికరంగా రేపటి నామినేషన్ ప్రక్రియ..!

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: తప్పైతే నామినేట్‌ చేస్కోండి: షణ్ముఖ్‌

Hardworkneverfail

Bigg Boss 5 Finals Promo : గెలిచేది ఎవరు?

Hardworkneverfail

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌కు ఫ్రెండ్‌షిప్ వాల్యూ తెలీదు, అత‌డు ఫేక్‌ : సిరి

Hardworkneverfail

Bigg Boss Telugu 5: ఎవరు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి?

Hardworkneverfail

Brahmastra Movie : ‘బ్రహ్మస్త్రం’ మూవీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..

Hardworkneverfail