Acharya Trailer : మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ పై భారీ అంచనాలున్నాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పడు విడుదలవుతుందా? అని మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఇప్పుడు ఈ నెల 29న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా మూవీ అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ‘ఆచార్య’ ట్రైలర్ చూసిన తర్వాత స్టొరీ పాయింట్ చాలా వరకు రివీల్ చేసినట్లు అనిపించినా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి.
ధర్మస్థలి అనే ఊరులో ఉండే రామ్ చరణ్ ఆ ఊరిని కాపాడుతూ ఉంటాడు, కానీ తను నక్సలైట్ గా మారతాడు.. తనకి సీనియర్ గా మెగాస్టార్ చిరంజీవి ఉండగా ధర్మస్థలి ఊరిని పట్టి పీడిస్తున్న సోనూ సూద్ ని ఎదిరించడానికి చిరంజీవి రంగంలోకి దిగుతాడు, తర్వాత ఏం జరిగింది అన్నది మొత్తం మీద ‘ఆచార్య’ మూవీ కథగా ట్రైలర్ చూస్తె అర్ధం అయింది, స్టొరీ పాయింట్ ఎలా ఉన్నా ట్రైలర్ లో హీరోయిజం ఎలివేట్ అయ్యే షాట్స్ మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ ప్రజెన్స్ హీరోయిజం సీన్స్ నెక్స్ట్ లెవల్ లో దుమ్ము లేపగా రామ్ చరణ్ సీన్స్ కూడా అదే రేంజ్ లో రచ్చ చేశాయి. ఇక ఈ సీన్స్ కి మణిశర్మ కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోగా ట్రైలర్ కి ఇవి మేజర్ హైలెట్స్ గా నిలిచాయి.
డైరెక్టర్ కొరటాల శివ స్టొరీ ఈజీగా చెప్పెలానే ఉన్నప్పటికీ టేకింగ్ అండ్ యాక్షన్ సీన్స్ తో తన మార్క్ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవల్ లో మాస్ ని జోడించి దుమ్ము దులిపేశాడు. మొత్తం మీద ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండగా ట్రైలర్ లో ఉన్న హీరోయిజం ఎలివేట్ సీన్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది. ఇక మూవీ రిలీజ్ అయ్యాక ఇదే రేంజ్ లో అనిపిస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు.
Acharya Trailer ..