Bright Telangana
Image default

RRR Movie Trailer : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

rrr movie trailer release date

ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ మూవీ అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది మూవీ యూనిట్.

డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్స్, ‘దోస్తీ’, ‘నాటు నాటు’ పాటలతో పాటు ఇటీవల విడుదల చేసిన ‘జనని’ వీడియో సాంగ్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేశాయి. ‘నాటు నాటు’ పాట అన్ని భాషల్లో కలిపి దాదాపు 75 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్రైలర్ అప్‌డేట్ రానే వచ్చేసింది.

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ డేట్‌లో ఏ సమయంలో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీపై తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ వెయిట్ చేస్తోంది.

Related posts

RRR Movie 2 Days Total Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail

RRR Pre Release Event : తారక్‌ది సింహం లాంటి వ్యక్తిత్వం.. RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్

Hardworkneverfail

RRR Movie New Year Grand Event

Hardworkneverfail

Acharya Movie : ‘ఆచార్య’ మూవీ ఓటిటి డీల్ క్లోజ్..!

Hardworkneverfail

Acharya Movie Postponed : ‘ఆచార్య’ విడుదల వాయిదా..

Hardworkneverfail

KGF Chapter 2 Trailer :  కెజిఎఫ్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Hardworkneverfail