KGF Chapter 2 Trailer Out Now : అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మూవీస్ లో కెజిఎఫ్ 2 ఒకటి. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హోంబాలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే కెజిఎఫ్ తో అంచనాలను తారుమారుచేసి పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్న ఈ మూవీ సెకండ్ పార్ట్ గా కెజిఎఫ్ 2 రానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ రికార్డులను బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ మెగా ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు.
కెజిఎఫ్ లో గరుడను చంపిన తరువాత ఏం జరిగింది..? అంటూ జర్నలిస్ట్ ప్రశ్నతో మొదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. రక్తంతో రాసిన కథ ఇది.. రక్తాన్ని కావాలంటుంది అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్ తో కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ మొత్తాన్ని ఒక లైన్ లో చెప్పేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. గరుడ చనిపోయాక ఆ కెజిఎఫ్ గనులను సొంతం చేసుకోవడానికి అధీరా పోరాటం ఒక పక్క. మరోపక్క తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి రైమా సేన్ రాజకీయ ఎత్తులు ఉత్కంఠను రేకెత్తించాయి. ఇక వీరికి అడ్డుగా.. ప్రజలకు అండగా రాఖీ బాయ్ (యష్) నిలబడడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కెజిఎఫ్ లో చూపించిన విధంగానే రాఖీ బాయ్ ఒకరికి తలవంచకుండా ఆ కెజిఎఫ్ ని ఎవరి చేతికి పోనివ్వకుండా ఎలా కాపాడాడు, చివరికి ఒక చరిత్రను సృష్టించిన రాఖీభాయ్ ఏమయ్యాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక మూవీ మొత్తానికి యష్ నటన హైలెట్ గా నిలవనుంది. రాఖీ బాయ్ కి ధీటుగా సంజయ్ దత్ లుక్ (అధీరాగా), నటన ప్రేక్షకులను సీట్లల్లో కుర్చోనివ్వదని తెలుస్తోంది. ఇక రావు రమేష్, ఈశ్వరి రావు, శ్రీనిధి శెట్టి పాత్రలు కీలకంగా కనిపించనున్నాయి. చివర్లో అమ్మ డైలాగ్ ని చూపించి కెజిఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2)లో కూడా తల్లి సెంటిమెంట్ ఉండనున్నట్లు డైరెక్టర్ హింట్ ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్ పవర్ ఫ్యాక్డ్ గా కట్ చేశారు. వైలెన్స్ రాఖీ భాయ్ ని వెత్తుకుంటూ వచ్చింది అనే డైలాగ్ తో యష్ క్యారెక్టర్ ని చూపించేశారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాపంగా రిలీజ్ కానుంది.