హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. మరోసారి మెట్రో రైలు సర్వీసు సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో సంస్థ. ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ వేళల్లో మార్పులు చేసింది. కొత్త టైంటేబుల్ నవంబర్ 10 నుంచే అమలులోకి రానున్నాయి. ఉదయం 6 గంటలకు తొలి మెట్రో రైలు ప్రారంభం కానుంది. అలాగే రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. మెట్రో సేవలు పొడిగించాలని మంత్రి కేటీఆర్‌ను అభినవ్ సుదర్శి ఓ ప్రయాణికుడు కోరడంతో దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి.. మెట్రో రైల్ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మెట్రో రైల్ సేవల వేళ్లలో మార్పులు చోటుచేసుకున్నాయి.
అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు మెట్రో రైలు కష్టాలపై కొన్ని వీడియోలను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఉదయం 6 గంటలకే ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు వస్తున్నారు. కానీ సర్వీసులు 7 గంటలకు కానీ ఫ్రారంభం కావటంలేదని…… అంతసేపు ప్రయాణికులు వేచి ఉండాల్సి వస్తోంది.
ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకుంటే… ఉదయం పూట కాబట్టి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికు సౌలభ్యం కోసం ఉదయం 6గంటలనుంచే మెట్రో రైలు సేవలను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను అంటూ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాడు.
ఆ ట్వీట్ లో ఉదయం 6 గంటలకే మెట్రో స్టేషన్లలో ఉన్న ప్రయాణికుల షార్ట్ వీడియోను ప్రదర్శించాడు. దీంతో కేటీఆర్ ఆవీడియోను సమర్ధిస్తూ, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రీట్వీట్ చేయటంతో ఈనిర్ణయం తీసుకున్నారు.
I agree with your suggestion Abhinav@md_hmrl and @ltmhyd please coordinate and ensure https://t.co/36OMtyaVxq
— KTR (@KTRTRS) November 8, 2021
Dalitha Bandhu Scheme : దళితబంధు పై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష