Bright Telangana
Image default

Minister Harish Rao : కోవిషీల్డ్ టీకా డోసుల వ్యవధి తగ్గించండి

harish rao

హైదరాబాద్‌ (తెలంగాణ) : కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య ఉన్న వ్యవధిని తగ్గించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును కేంద్రాన్ని కోరారు. రెండు డోస్‌ల మధ్య 12 వారాల వ్యవధి ఉండడంతో ఇబ్బంది ఉందన్నారు. గతంలో మాదిరిగా 4-6 వారాలకు తగ్గించాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు. వలస కూలీలు మొదటి డోస్ వేసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని వారికి సెకండ్‌ డోస్‌ వేయడం కష్టమవుతుందన్నారు.

మొదటి డోస్ వేసుకున్నవారి వివరాలు కొవిన్ పోర్టర్‌లో అప్లోడ్ చేస్తున్నా ఆ జాబితా ఆ రాష్ట్రానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నట్టు చెప్పారు. రెండో డోస్ వ్యవధిని గతంలో మాదిరిగా 4-6 వారాలకు తగ్గిస్తే.. టీకా తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. తెలంగాణలో 2.77 కోట్ల మంది టీకాలు తీసుకునేందుకు అర్హులుగా గుర్తించామని, ఇందులో ఇప్పటి వరకు 3.77 కోట్ల డోసులను వేసినట్లు చెప్పారు. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, హైరిస్క్‌ గ్రూప్‌ వారికి రెండో డోసు వేసి 8 నుంచి పది నెలల సమయం గడిచిందని, మరోవైపు కొత్త వేరియంట్లు వస్తున్న నేపథ్యంలో కరోనా వారియర్స్‌కి బూస్టర్ డోస్ వేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Related posts

సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఇస్తాం: మంత్రి హరీష్ రావు

Hardworkneverfail

Munugode Bypoll: మునుగోడులో విజయం ఆ పార్టీదే.. తేల్చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌..

Hardworkneverfail

Bandi Sanjay: ముగిసిన ప్రజా సంగ్రామ యాత్ర.. భావోద్వేగానికి గురైన బండి సంజయ్

Hardworkneverfail

Telangana: దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ ఏం చెప్పారంటే..!

Hardworkneverfail

Harish Rao: నిర్మలా సీతారామన్‌కు హరీష్‌ రావ్‌ సవాల్‌.. నేను రాజీనామా చేస్తా.. మీరు చేస్తారా?

Hardworkneverfail

CM KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్.. నేడు ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ

Hardworkneverfail