టీ20 వరల్డ్ కప్ 2021: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. పాకిస్థాన్ ఓపెనర్ల దూకుడుకు ఇండియా చేతులెత్తేసింది. పాకిస్థాన్ ఓపెనర్లు రిజ్వాన్, అజమ్‌లు అసలు ఎక్కడ తడబడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. భారత్ ఇచ్చిన 151 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ సునాయాసంగా చేధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాకిస్థాన్ జయ కేతనాన్ని ఎగరవేసింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇండియా మొదటి నుంచి తడబడింది. పాకిస్థాన్ బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో భారత ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. ఇండియా బ్యాట్స్‌మెన్‌లో కేవలం విరాట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇండియాను విరాట్ ఆదుకున్నాడు. 48 బంతుల్లో 57 పరుగులు చేశాడు.
సహచరులు రిషబ్ పంత్, రవీంద్ర జాడేజాతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే పాకిస్థాన్ ఓపెనర్ల వేగాన్ని మాత్రం ఇండియా బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. దీంతో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా పాకిస్థాన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
Pakistan record their first-ever win in ICC Men’s T20 World Cup against India!🇵🇰🙌#WeHaveWeWill pic.twitter.com/gsr5ooBcNe
— Pakistan Cricket (@TheRealPCB) October 24, 2021