Bright Telangana
Image default

T20 World Cup 2021 : ఉత్కంఠ పోరులో శ్రీలంకపై సౌతాఫ్రికా విజయం

south africa vs sri lanka 2021

టీ20 వరల్డ్ కప్ 2021: సూపర్ 12 లో భాగంగా సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన టార్గెట్ ను 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఒకానొక సమయంలో శ్రీలంక గెలిచేలా కనిపించింది. కానీ, సౌతాఫ్రికా మళ్లీ పుంజుకుంది. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా 46 పరుగులతో రాణించాడు. డేవిడ్ మిల్లర్ 23 పరుగులు, కగిసో రబాడా 13 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ మూడు వికెట్లు తీశాడు. చమీర 2 వికెట్లు తీశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ పాతుమ్ నిశంక 72, అసలంక 21 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో షంషీ, ప్రిటోరియస్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, అన్రిక్ నార్జ్ రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లు వేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన షంషీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా 4 పాయింట్లతో గ్రూప్ 1లో మూడో స్థానానికి ఎగబాకింది.

హసరంగా హ్యాట్రిక్..
వనిందు హసరంగ టీ20 ఇంటర్నేషనల్స్‌లో హ్యాట్రిక్ సాధించిన శ్రీలంక తరపున ఐదవ ఆటగాడిగా, టీ20 ప్రపంచ కప్‌లో మూడవ ఆటగాడిగా నిలిచాడు. హసరంగా కంటే ముందు, ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ బ్రెట్ లీ 2007 టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై, ఐర్లాండ్‌కు చెందిన కర్టిస్ కాంప్‌ఫర్‌తో నెదర్లాండ్స్‌పై హ్యాట్రిక్ సాధించాడు. ఓవరాల్ టీ20 క్రికెట్‌లో ఇది 23వ హ్యాట్రిక్.

Related posts

T20 World Cup 2021: అఫ్గానిస్థాన్ పై భారీ తేడాతో గెలిచిన టీమిండియా

Hardworkneverfail

Ind vs Pak T20 Match: నేడు భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్

Hardworkneverfail

T20 World Cup 2021 : ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికాదే విజయం.. అయినా ఇంటికే..

Hardworkneverfail

T20 World Cup 2021 : ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం…

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్‌ పై నమీబియా విజయం

Hardworkneverfail

T20 World Cup 2021: శ్రీలంక పై ఇంగ్లండ్‌ ఘన విజయం..!

Hardworkneverfail