టీ 20 ప్రపంచ కప్ 2021: గ్రూప్ -1 లో నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు సెమీస్ కు చేరుకున్నాయ్. డూ ఆర్ డై మ్యాచులో సౌతాఫ్రికా గెలిచినా ఫలితం లేకుండా పోయింది. ఒకవేళ 130 పరుగులలోపు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి ఉంటే సౌతాఫ్రికా సెమీస్ చేరి ఉండేది. తక్కువ నెట్ రన్ ఉండటంతో సౌతాఫ్రికా సెమీస్ కు దూరమైంది.
చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమైంది. అఖరి ఓవర్‌లో 14 పరుగుల కావల్సిన నేపథ్యంలో కగిసో రబడా హ్యట్రిక్ వికెట్లతో మెరిశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఆలీ(37), మలాన్(33),లివింగ్‌స్టోన్(27) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించినప్పటికీ సెమిస్‌కు ఆర్హత సాధించలేక పోయింది.
కాగా అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 189 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంత భారీ స్కోరు చేసిందంటే అందుకు కారణం వన్ డౌన్ బ్యాట్స్ మన్ వాన్ డర్ డుస్సెన్ విధ్వంసక ఇన్నింగ్సే.
వాన్ డర్ డుస్సెన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లోనే 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అతడికి మార్ క్రమ్ కూడా తోడవ్వడంతో సఫారీ స్కోరు బోర్డు దూసుకెళ్లింది. మార్ క్రమ్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేశాడు. అంతకుముందు ఓపెనర్ డికాక్ 34 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, అదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.