Bright Telangana
Image default

T20 World Cup 2021 : బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా విజయం…సెమీస్ రేసు నుంచి ఔట్ బంగ్లా…

SA vs BAN

టీ20 వరల్డ్ కప్ 2021:  సౌతాఫ్రికా మరో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన టార్గెట్ ను 13.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ టెంబా బవుమా 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వాన్ డర్ డుస్సెన్ 22, డికాక్ 16 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, మెహదీ హసన్ , నసుమ్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.

కాగా, ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ తర్వాత రెండోస్థానంలో నిలిచింది. సూపర్-12 దశలో సౌతాఫ్రికా ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు, ఒక ఓటమి నమోదు చేసింది. అటు, బంగ్లాదేశ్ ఆడిన 4 మ్యాచ్ లలోనూ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపాడు. కానీ, బంగ్లాదేశ్ జట్టు పూర్తి 50 ఓవర్లు కూడా ఆడలేక 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్‌లో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే పది పరుగులు దాటారు. 27 పరుగులు చేసిన మెహదీ హసన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సౌతాఫ్రికా తరఫున నార్కియా, రబడా తలో 3 వికెట్లు తీసి విజయవంతమైన బౌలర్లుగా నిలిచాడు. రబాడా 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే 3.2 ఓవర్లలో 8 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు నార్కియా.

Related posts

T20 World Cup 2021 : ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం…

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్‌‌ పై 130 పరుగుల భారీ తేడాతో అప్ఘానిస్తాన్ ఘన విజయం

Hardworkneverfail

T20 World Cup 2021: అఫ్గానిస్థాన్ పై భారీ తేడాతో గెలిచిన టీమిండియా

Hardworkneverfail

T20 World Cup Final: నేడే టీ20 ప్రపంచకప్ ఫైనల్.. కివీస్‌-ఆసీస్‌ మధ్య ఫైనల్‌ పోరు

Hardworkneverfail

T20 World Cup Final: ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం..

Hardworkneverfail

T20 World Cup: ఫైనల్ లో ఆస్ట్రేలియా..పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

Hardworkneverfail