Bright Telangana
Image default

T20 World Cup 2021: అఫ్గానిస్థాన్ పై భారీ తేడాతో గెలిచిన టీమిండియా

India vs Afghanistan

టీ 20 ప్రపంచ కప్ 2021: టోర్నీలో ఎట్టకేలకు టీమిండియా తొలి విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో, న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధిచింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ తడబడింది. భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 66 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధిచింది.

టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు, అశ్విన్ రెండు వికెట్లతో సత్తా చాటారు. అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ ( 32 బంతుల్లో 35 పరుగులు), కరీమ్ జన్నత్ ( 22 బంతుల్లో 42 పరుగులు) రాణించారు.

అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా…. అఫ్ఘనిస్థాన్‌పై రెచ్చిపోయారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు), కేఎల్ రాహుల్‌ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (27; 13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు), ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా (35; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) కూడా చెలరేగారు. మొత్తానికి ఇండియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసి.. ఆఫ్ఘనిస్థాన్‌ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆప్ఘన్ బౌలర్లలో కరీమ్ జనత్, గుల్బాదిన్ నైబ్ చెరో వికెట్ కూల్చారు.

ఇక, ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఇదే తొలి విక్టరీ. ఈ విజయంతో తన ఆశల్ని సజీవంగా ఉంచుకుంది ఇండియా. ఒక వేళ అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్ ను ఓడిస్తే టీమిండియాకు ఛాన్స్ ఉంటుంది. అలాగే, టీమిండియా మిగతా రెండు మ్యాచుల్లో భారీ రన్ రేట్ తో గెలవాలి.

Related posts

T20 World Cup 2021: న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం..

Hardworkneverfail

T20 World Cup 2021: 20 రన్స్ తేడాతో వెస్టిండీస్ పై శ్రీలంక గెలుపు..

Hardworkneverfail

T20 World Cup: అఫ్ఘానిస్తాన్‌పై న్యూజిలాండ్‌ విజయం.. సెమీస్ నుంచి ఇండియా ఔట్!

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్‌ పై నమీబియా విజయం

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్ పై టీమిండియా ఘన విజయం … కేవలం 39 బంతుల్లో టార్గెట్ ఫినిష్

Hardworkneverfail

T20 World Cup 2021: బంగ్లాపై ఆసీస్ అద్భుత విజయం.. కేవలం ఆరు ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్..

Hardworkneverfail