టీ 20 ప్రపంచ కప్ 2021: టోర్నీలో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 73 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 6.2ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 78 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్ ఫించ్(20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(10 బంతుల్లో 16; 3ఫోర్లు) మెరుపులు మెరిపించగా.. చివర్లో మిచెల్ మార్ష్(5 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మ్యాచ్‌ను లాంఛనంగా పూర్తి చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ భారీ విజయంతో ఆస్ట్రేలియా 2 పాయింట్లు సాధించి దక్షిణాఫ్రికాను సమం చేయగా, నెట్ రన్ రేట్‌లో కూడా అద్భుతంగా మెరుగుపడి ఆఫ్రికా జట్టును అధిగమించి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు సూపర్-12 రౌండ్‌లో వరుసగా 5 ఓటములతో బంగ్లాదేశ్ ప్రయాణం నిరాశాజనకంగా ముగిసింది. ఆస్ట్రేలియా విజయంతో.. సౌతాఫ్రికా మూడో స్ధానానికి పడిపోయింది. ఐదు వికెట్లతో సత్తా చాటిన ఆడమ్ జంపాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Australia are one step closer to the semis 💪#T20WorldCup | #AUSvBAN | https://t.co/apDTWI2E8S pic.twitter.com/IDFScSBv07
— T20 World Cup (@T20WorldCup) November 4, 2021