టీ20 ప్రపంచకప్ : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్-12 తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా .. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరంగా ఉంటున్న టీమ్‌ఇండియా.. గత కొన్నేండ్లుగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే దాయాదితో తలపడుతున్నది. టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరుగగా.. ఐదింట నెగ్గిన ఇండియా ఫుల్ జోష్‌తో బరిలోకి దిగనుంది. వన్డే ప్రపంచకప్‌లో ఇండియా, పాక్ మధ్య ఏడు మ్యాచ్‌లు జరుగగా.. అందులోనూ టీమ్‌ఇండియా సం పూర్ణ ఆధిపత్యం కనబర్చిన నేపథ్యంలో పాకిస్థాన్ అండర్‌డాగ్‌గా మైదానంలో అడుగుపెట్టనుంది. ఫలితంగా తాజాగా జరిగే మ్యాచ్‌పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అది ఎంతలా అంటే సినిమా థియేటర్ల నెట్‌వర్కింగ్ సంస్థలు ఏకంగా తమ థియేటర్లలో.. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులు సంపాదించాయి.
టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై ఐదుసార్లు గెలిచిన భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుత జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తుండటం టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశం కాగా.. కీలక పోరుకు ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది