టి20 ప్రపంచకప్ 2021 : బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. జేసన్ రాయ్ (61; 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్ మలన్ (28; 25 బంతుల్లో 3 ఫోర్లు) రాణించడంతో బంగ్లాదేశ్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ఛేదించింది.
ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ జాస్ బట్లర్ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివరకు డేవిడ్ మలాన్(28, నాటౌట్), జాన్ బెయిర్‌స్టో(08, నాటౌట్) పరుగులతో ఇంగ్లాండ్‌కు సునాయాస విజయాన్ని అందించారు. ఇంకా 35 బంతులు మిగిలి ఉండానే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడిన జేసన్ రాయ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. వరుసగా రెండు విజయాలతో ఇంగ్లాండ్ ప్రస్తుతం గ్రూప్-1లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.